Nampally: విచారణ పేరుతో కాలయాపన చేశారు: మన్నె క్రిశాంక్
Nampally: నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో 6 గంటల పాటు విచారణ పేరుతో పోలీసులు కాలయాపన చేశారని బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ మండిపడ్డారు.
Nampally: విచారణ పేరుతో కాలయాపన చేశారు: మన్నె క్రిశాంక్
హైదరాబాద్: నాంపల్లి పోలీస్‌స్టేషన్‌లో బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌ను పోలీసులు విచారించారు.
మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారణ పేరుతో కాలయాపన చేశారే తప్ప తనను ఎలాంటి ప్రశ్నలు అడగలేదని క్రిశాంక్ తెలిపారు.
ఈ నెల 28న మరోసారి సీసీఎస్‌కు హాజరు కావాలని పోలీసులు సూచించి పంపించినట్లు చెప్పారు.
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు పార్టీ న్యాయ బృందం తనకు అండగా ఉందన్నారు.
ప్రజా సమస్యలను పార్టీ తరఫున మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
తనపై గతంలో కేసులు నమోదు చేసి జైలుకు పంపించారని, ప్రస్తుతం కూడా విచారణల పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
తన ఇంటి తలుపులు పగులగొట్టి, కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురిచేశారని ఆయన పేర్కొన్నారు.
ఎన్ని సార్లు విచారణకు పిలిచినా చట్టపరంగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుటుంబానికి సంబంధించిన ఓ కంపెనీకి భూమి కేటాయింపుపై తాము ప్రశ్నలు లేవనెత్తుతున్నామని క్రిశాంక్ చెప్పారు.
టెసెరాక్ట్ కంపెనీకి భూమి కేటాయింపు, అందులో పెట్టుబడులు, ఉద్యోగుల వివరాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపైనా తాము ప్రశ్నించామని తెలిపారు.
దానం నాగేందర్ అంశాన్ని పక్కదారి పట్టించేందుకే తమపై విచారణలు, కేసుల పేరుతో చర్యలు తీసుకుంటున్నారని క్రిశాంక్ ఆరోపించారు. ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా ప్రజా సమస్యలను లేవనెత్తడం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.




