Khairatabad: డ్రగ్ ఫ్రీ సొసైటీ నిర్మాణానికి అందరూ భాగస్వాములు కావాలి: కీర్తి రెడ్డి!

Khairatabad: డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని బీజేపీ నేత జూటూరు కీర్తి రెడ్డి కిషన్ రెడ్డి పాదయాత్రలో పిలుపునిచ్చారు.

RAJESH,	WEST ZONE
Published on: 27 Nov 2026 3:54 PM IST
Khairatabad
X

Khairatabad: డ్రగ్ ఫ్రీ సొసైటీ నిర్మాణానికి అందరూ భాగస్వాములు కావాలి: కీర్తి రెడ్డి!

హైదరాబాద్: డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమని బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జూటూరు కీర్తి రెడ్డి అన్నారు. రెండో రోజు ఖైరతాబాద్ నియోజకవర్గంలోకి ప్రవేశించిన నషా ముక్త్ భారత్ పాదయాత్రలో పాల్గొని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యువత డ్రగ్స్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆశయమైన నషా ముక్త్ భారత్ లక్ష్యాన్ని ప్రజా ఉద్యమంగా మార్చాలని, 2029 నాటికి డ్రగ్స్ రహిత భారతదేశ సాధనకు అందరూ కృషి చేయాలని కోరారు.

డ్రగ్స్ సరఫరా, విక్రయాలు, వినియోగాన్ని అరికట్టడంతో పాటు వాటి దుష్ప్రభావాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు. యువతను కాపాడుకోవడమే దేశ భవిష్యత్తును కాపాడుకోవడమని పేర్కొన్నారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE