Uppal: అరుదైన వృక్షాల సంరక్షణే ప్రకృతి సంపద
Uppal: అరుదైన వృక్ష జాతుల పరిరక్షణపై అవగాహన అవసరమన్న ఉప్పల్ ఎఫ్ఆర్ఓ శరత్‌చంద్రారెడ్డి. శాంతివనం పార్కును సందర్శించిన ఫారెస్ట్ అకాడమీ శిక్షణార్థులు.
Uppal: అరుదైన వృక్షాల సంరక్షణే ప్రకృతి సంపద
ఉప్పల్: అరుదైన వృక్ష జాతుల పరిరక్షణతో పాటు వాటి పెంపకం, సంరక్షణ విధానాలపై క్షేత్రస్థాయిలో అవగాహన అవసరమని ఉప్పల్ ఎఫ్ఆర్ఓ శరత్‌చంద్రారెడ్డి అన్నారు.
తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ శిక్షణార్థులు ఉప్పల్ రేంజ్ పరిధిలోని మేడిపల్లి శాంతివనం పార్కును సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా శిక్షణార్థులు శాంతివనంలోని ఆఫ్రికన్ బావాబాబ్ నర్సరీతో పాటు వివిధ రకాల మొక్కల నర్సరీలను పరిశీలించారు.
మొక్కల పెంపకం, నర్సరీ నిర్వహణ, సంరక్షణ పద్ధతులను క్షేత్రస్థాయిలో తెలుసుకున్నారు. అనంతరం చెంగిచెర్ల రిజర్వ్ ఫారెస్టును సందర్శించి అక్కడి బావాబాబ్ చెట్లను పరిశీలించారు.
అరుదైన వృక్షాల ప్రత్యేకతలు, వాటి పరిరక్షణ, రక్షణకు చేపడుతున్న చర్యలపై అధికారులు వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ అనిత, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ప్రీతి పూజతో పాటు అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.




