Amangal: నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో ఆమనగల్‌కు ప్రాధాన్యత కల్పించాలి!

Amangal: నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో ఆమనగల్ పూర్వపు సమితిని తాలూకా కేంద్రంగా ఏర్పాటు చేయాలని మున్సిపల్ చైర్మన్ పత్య నాయక్ ఆదివారం డిమాండ్ చేశారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 29 Nov 2026 4:19 PM IST
Amangal
X

Amangal: నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో ఆమనగల్‌కు ప్రాధాన్యత కల్పించాలి!

రంగారెడ్డి జిల్లా, ఆమనగల్: కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆమనగల్ పూర్వపు సమితిని తాలూకా కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఆమనగల్ మున్సిపల్ చైర్మన్ పత్య నాయక్ ఆదివారం డిమాండ్ చేశారు. ఈ ప్రాంత ప్రజల ఎన్నో ఏళ్ల ఆశలు, ఆకాంక్షలు నెరవేరేలా ప్రభుత్వాలు, డీలిమిటేషన్ కమిటీ చొరవ చూపాలని కోరారు.

ఆమనగల్‌ను తాలూకా కేంద్రంగా ప్రకటిస్తే ఈ ప్రాంతం సమగ్ర అభివృద్ధికి బాటలు పడతాయని ఆయన పేర్కొన్నారు. తాలూకా కేంద్రం ఏర్పాటుతో పలు కీలక ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు అయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. దీంతో ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ కావడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగి, వ్యాపార రంగం అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు.

ఆమనగల్ ప్రాంత అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తప్పనిసరిగా తాలూకా కేంద్రంగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ ఈ అంశంపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు, అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ఐక్య ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు.

డీలిమిటేషన్ కమిటీ, ప్రభుత్వం అఖిలపక్ష నాయకులతో పాటు అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను సేకరించి, ఆమనగల్‌ను తాలూకా కేంద్రంగా ఏర్పాటు చేసే అంశానికి ప్రాధాన్యత ఇవ్వాలని పత్య నాయక్ కోరారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY