Medchal: మేడ్చల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రైవేట్ పరిశ్రమ పూజారి దారుణ మృతి

Medchal: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డబీల్‌పూర్ చౌరస్తా సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ప్రైవేట్ పరిశ్రమ పూజారి శారద కృష్ణ అక్కడికక్కడే మృతి చెందారు.

NAKSHATRAM, MEDCHAL
Published on: 19 Oct 2026 9:47 AM IST
Medchal
X

Medchal: మేడ్చల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రైవేట్ పరిశ్రమ పూజారి దారుణ మృతి

Medchal: గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఓ పరిశ్రమ పూజారి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శారద కృష్ణ (60) గత కొన్నేళ్లుగా మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని చెట్లగౌరారం గ్రామ పరిధిలో ఉన్న ఎంఎస్ అగర్వాల్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో పూజారిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి పరిశ్రమ ప్రాంగణంలోనే నివాసం ఉంటున్నారు. ​

సోమవారం ఉదయం శారద కృష్ణ తన ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనంపై మేడ్చల్ వైపు వస్తుండగా డబీల్‌పూర్ చౌరస్తా సమీపంలోని పంజాబీ దాబా వద్దకు చేరుకోగానే వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలు కావడంతో ఆయన ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. ​

సమాచారం అందుకున్న మేడ్చల్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి ఈ మేరకు కేసు నమోదు చేసుకుని, ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

NAKSHATRAM, MEDCHAL

NAKSHATRAM, MEDCHAL