Farooqnagar: గిరిజన పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న ప్రజా ప్రభుత్వం
Farooqnagar: రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం గౌరికుంట తండాలో గిరిజన మహిళ అరుణ రాజు ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ వేడుకలో షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు.
Farooqnagar: గిరిజన పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న ప్రజా ప్రభుత్వం
రంగారెడ్డి జిల్లా: ఫరూఖ్‌నగర్ మండలంలోని చించోడ్ గ్రామ పంచాయతీ పరిధిలో గల గౌరికుంట తండాలో ఈరోజు ఉదయం నిరుపేద గిరిజన మహిళ అరుణ రాజు నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో షాద్‌నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లబ్ధిదారురాలికి శుభాకాంక్షలు తెలియజేసి, నూతన గృహంలోకి అడుగుపెట్టిన కుటుంబానికి శుభాకాంక్షలు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం షాద్‌నగర్ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని తెలిపారు. రెండవ విడతలో మరో 1500 ఇండ్లను మంజూరు చేసిందని అన్నారు. చించోడ్ గ్రామంలో 47 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, గౌరికుంట తండాకు మూడు ఇళ్లను కేటాయించినట్లు వెల్లడించారు.




