Vikarabad: వికారాబాద్ విచ్చికా రిసార్ట్‌పై పోలీసుల మెరుపు దాడి!

Vikarabad: గాంధీ జయంతి నాడు వికారాబాద్ గోధుమగూడ విచ్చికా రిసార్ట్‌పై పోలీసుల ఆకస్మిక దాడి మాంసాహార విక్రయాలు, కుళ్లిన మాంసం నిల్వల గుర్తింపు యాజమాన్యానికి హెచ్చరిక.

MOGULAIAH, VIKARABAD
Published on: 2 Oct 2026 11:25 PM IST
Vikarabad
X

Vikarabad: వికారాబాద్ విచ్చికా రిసార్ట్‌పై పోలీసుల మెరుపు దాడి!

వికారాబాద్ జిల్లా: గాంధీ జయంతి సందర్భంగా వికారాబాద్ మండలం గోధుమగూడ గ్రామ పరిధిలోని విచ్చికా రిసార్ట్‌లో పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. ఈ తనిఖీల్లో రిసార్ట్‌లో మాంసాహార వంటకాలు విక్రయిస్తున్నట్లు, ఫ్రిడ్జ్‌లలో కుళ్లిపోయిన మాంసం నిల్వలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది.

గాంధీ జయంతి రోజున అమలులో ఉండే నిబంధనలను పట్టించుకోకుండా రిసార్ట్ యాజమాన్యం వ్యవహరించిందని పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. నిబంధనల ఉల్లంఘనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించినట్లు తెలుస్తోంది.

ఈ ఘటన వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గాంధీ జయంతి వంటి ప్రత్యేక రోజుల్లో నిబంధనల అమలుపై పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తనిఖీలతో జిల్లాలోని ఇతర రిసార్ట్‌లు, హోటళ్ల యాజమాన్యాల్లో కూడా అప్రమత్తత పెరిగినట్లు స్థానికులు పేర్కొంటున్నారు.

అయితే కేవలం గాంధీ జయంతి రోజున మాత్రమే కాకుండా ఏడాది పొడవునా హోటళ్లు, రిసార్ట్‌లలో ఆహార భద్రత, పరిశుభ్రత, ఇతర చట్టపరమైన నిబంధనల అమలుపై అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని ప్రజలు, స్థానికులు, ప్రజా సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. నామమాత్రపు తనిఖీలకు పరిమితం కాకుండా నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

మద్యం లభించిందా?

ఇదిలా ఉండగా, పోలీసుల తనిఖీల్లో మద్యం కూడా లభించిందా? లేదా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD