Hyderabad: హైదరాబాద్‌లో పెళ్లి పేరుతో మోసం చేసిన ఎస్సైపై సైదాబాద్‌లో కేసు నమోదు!

Hyderabad: హైదరాబాద్‌లోని సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివాహం చేసుకుంటానని నమ్మించి మహిళపై లైంగిక దాడికి పాల్పడిన ఖైరతాబాద్ డీఐ బాలస్వామిపై కేసు నమోదైంది.

MOHD MOHIUDDIN, YAKUTHAPURA
Published on: 11 Oct 2026 10:08 AM IST
Hyderabad
X

Hyderabad: హైదరాబాద్‌లో పెళ్లి పేరుతో మోసం చేసిన ఎస్సైపై సైదాబాద్‌లో కేసు నమోదు!

Hyderabad: సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఖైరతాబాద్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ (DI) ఓ మహిళను ప్రేమ పెళ్లి పేరుతో లైంగిక దాడి చేశాడు అని ఫిర్యాదు. ప్రస్తుతం ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్‌లో డీఐగా పనిచేస్తున్న బాలస్వామిపై సైదాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

2016లో కోర్టు ఆదేశాల అమలు నిమిత్తం చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన సమయంలో బాధితురాలికి బాలస్వామితో పరిచయం ఏర్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. 2017లో పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి శారీరక సంబంధం పెట్టుకున్నాడని బాధితురాలు ఆరోపించింది.

తన భర్త 2021లో మరణించిన తర్వాత కూడా పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు శారీరక సంబంధం కొనసాగించాడని ఫిర్యాదులో తెలిపింది. 2024లో బాలస్వామి భార్యాపిల్లలతో కలిసి ఉంటున్న విషయం తెలిసి ప్రశ్నించగా, పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పినట్లు ఆరోపించింది.

2025 జనవరి నుంచి తనను దూరం పెట్టడంతో మానసికంగా కుంగిపోయి చికిత్స తీసుకున్నానని బాధితురాలు పేర్కొంది. పెళ్లి పేరుతో మోసం చేసి, తనను లైంగికంగా దోపిడీ చేశాడని ఆరోపిస్తూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు ఆధారంగా సైదాబాద్ పోలీసులు క్రైమ్ నంబర్ 349/2026 కింద బీఎన్‌ఎస్ సెక్షన్లు 69, 81, 351(2), 352 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

MOHD MOHIUDDIN, YAKUTHAPURA

MOHD MOHIUDDIN, YAKUTHAPURA