Gachibowli: ‘స్కై కేఫ్’లో అక్రమ హుక్కా దందాపై పోలీసుల మెరుపు దాడి!

Gachibowli: గచ్చిబౌలి వినాయక్ నగర్‌లోని 'స్కై కేఫ్'లో అక్రమంగా నిర్వహిస్తున్న హుక్కా పార్లర్‌పై పోలీసులు మెరుపు దాడి చేశారు.

VISHWANATH, SHERILINGAMPALLY
Published on: 17 Nov 2026 7:50 AM IST
Gachibowli
X

Gachibowli: ‘స్కై కేఫ్’లో అక్రమ హుక్కా దందాపై పోలీసుల మెరుపు దాడి!

Gachibowli: ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి, ఆహార పదార్థాల విక్రయాల ముసుగులో అక్రమంగా హుక్కా దందా నిర్వహిస్తున్న ఓ కేఫ్‌పై గచ్చిబౌలి పోలీసులు మెరుపు దాడి చేశారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక్ నగర్‌లో ఉన్న 'స్కై కేఫ్'లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ఈ గుట్టును రట్టు చేశారు.

స్కై కేఫ్ నిర్వాహకులు ఎలాంటి అనుమతులు లేకుండా యువతను ఆకర్షిస్తూ వినియోగదారులకు అక్రమంగా హుక్కా సేవలను అందిస్తున్నారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు కేఫ్‌పై దాడి చేసి, అక్కడ పనిచేస్తున్న ముగ్గురు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ కేఫ్ నిర్వాహకులు మహమ్మద్ మొహసినుద్దీన్, పాషా, సిరాజ్, నదీమ్, శ్రీనివాస్ రెడ్డి, మధుకర్ రెడ్డి గతంలోనూ ఇదే తరహా అక్రమ కార్యకలాపాలకు పాల్పడి పోలీసులకు చిక్కారు. అయినప్పటికీ తమ తీరు మార్చుకోకుండా మళ్లీ గుట్టుచప్పుడు కాకుండా హుక్కా దందాను కొనసాగిస్తున్నట్లు విచారణలో తేలింది.

ఈ దాడిలో భాగంగా పోలీసులు 12 హుక్కా పాట్స్, 20 పైపులు, వివిధ రకాల ఫ్లేవర్ బాక్సులను సీజ్ చేశారు. వీటితో పాటు కేఫ్‌లోని ఒక ఎల్‌జీ టీవీ, స్పీకర్, రిఫ్రిజిరేటర్లు, ఓవెన్ మరియు కుర్చీలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న సామగ్రిని, అదుపులోకి తీసుకున్న ముగ్గురు సిబ్బందిని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పరారీలో ఉన్న ఆరుగురు నిర్వాహకులపై కేసు నమోదు చేసిన పోలీసులు, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టి దర్యాప్తు చేస్తున్నారు.

VISHWANATH, SHERILINGAMPALLY

VISHWANATH, SHERILINGAMPALLY