Ghatkesar: భారత్ సమ్మిట్ నేపథ్యంలో బీజేపీ నేత సుదర్శన్‌రెడ్డి ముందస్తు అరెస్ట్!
Ghatkesar: రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటన, భారత్ సమ్మిట్ నేపథ్యంలో మేడ్చల్ బీజేపీ ఇన్‌ఛార్జి ఏనుగు సుదర్శన్‌రెడ్డిని ఘట్‌కేసర్ పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.
Ghatkesar: భారత్ సమ్మిట్ నేపథ్యంలో బీజేపీ నేత సుదర్శన్‌రెడ్డి ముందస్తు అరెస్ట్!
Ghatkesar: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో మేడ్చల్ నియోజకవర్గ బీజేపీ ఇన్‌ఛార్జి, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డిని పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. భారత్ సమ్మిట్‌కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమంలో పాల్గొనకుండా ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి ఉందని, ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతులను ముందస్తు అరెస్టుల పేరుతో అణచివేయడం సరికాదని అన్నారు.
తెలంగాణలో నిరుద్యోగులు, రైతులు, విద్యార్థులు, సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాహుల్‌గాంధీ దృష్టి సారించాలని, ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్‌గాంధీ హైదరాబాద్‌కు వస్తున్నారనే కారణంతోనే ముందస్తు అరెస్టులు చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
'రాహుల్‌గాంధీ మా స్టార్ క్యాంపైనర్. ఆయన తెలంగాణకు వచ్చేది బీజేపీ గ్రాఫ్ పెంచడానికే. అలాంటప్పుడు మేమెందుకు లొల్లి చేస్తాం! మా పని మేము చేసుకుంటాం.. మీరే మా ప్రచారం చేసిపెడుతున్నారు!' అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
నాయకుల పర్యటనలతో ప్రజా సమస్యలు పరిష్కారం కావని, ఇచ్చిన హామీలను అమలు చేసి పాలనలో చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.
పోలీసుల ముందస్తు చర్యలకు భయపడేది లేదని, ప్రజా సమస్యలపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ అరెస్టుల్లో మండల కార్యదర్శి రమేష్ నాయుడు, బీజేవైఎం ఘట్‌కేసర్ డివిజన్ అధ్యక్షుడు అనిల్‌గౌడ్ తదితరులు ఉన్నారు.




