Vikarabad: వికారాబాద్‌లో ఘనంగా సైబర్ అవగాహన ఫ్లాష్ మార్చ్!

Vikarabad: వికారాబాద్‌లో జాతీయ సైబర్ భద్రత మాసం సందర్భంగా సైబర్ అవగాహన ఫ్లాష్ మార్చ్. డీఎస్పీ కాజల్ జైస్వాల్, టౌన్ ఇన్స్పెక్టర్ రఘు కుమార్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహణ.

MOGULAIAH, VIKARABAD
Published on: 1 Nov 2026 8:08 AM IST
Vikarabad
X

Vikarabad: వికారాబాద్‌లో ఘనంగా సైబర్ అవగాహన ఫ్లాష్ మార్చ్!

Vikarabad: జాతీయ సైబర్ భద్రత అవగాహన మాసం – అక్టోబర్ 2026 సందర్భంగా, వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, IPS గారి ఆదేశాల మేరకు, “PAUSE FOR SAFETY – PAUSE. THINK. VERIFY.” అనే నినాదంతో వికారాబాద్ జిల్లా D4C విభాగం ఆధ్వర్యంలో నెల రోజుల పాటు వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా సైబర్ నేరాలు, ఆన్‌లైన్ ఆర్థిక మోసాలు, డిజిటల్ లావాదేవీల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

కార్యక్రమాల ముగింపులో భాగంగా,సైబర్ క్రైమ్ డీఎస్పీ శ్రీమతి కాజల్ జైస్వాల్ సమక్షంలో వికారాబాద్ పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో చిగుళ్లపల్లి గ్రౌండ్ నుంచి బసవేశ్వర చౌరస్తా మీదుగా ఎన్టీఆర్ చౌరస్తా వరకు సైబర్ అవగాహన ఫ్లాష్ మార్చ్ నిర్వహించారు.

ఈ ఫ్లాష్ మార్చ్ ద్వారా సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించడం, ఆన్‌లైన్ మోసాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని సందేశాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ పోలీసు సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి – ఏదైనా లింక్‌పై క్లిక్ చేసే ముందు ఆలోచించండి, సమాచారాన్ని ధృవీకరించండి, సురక్షితమైన డిజిటల్ అలవాట్లను పాటించండి. ఇట్టి కార్యక్రమం లో వికారాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ రఘు కుమార్, యువతీయువకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొనడం జరిగింది.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD