Shabad: ప్రధాని మోదీ బర్త్‌డే: షాబాద్ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ!

Shabad: షాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు. బీజేపీ మండల అధ్యక్షుడు మద్దూరి మానయ్య ఆధ్వర్యంలో రోగులకు పండ్లు, పౌష్టికాహారం పంపిణీ.

RAGHAVENDRA, CHEVELLA
Published on: 17 Sept 2026 11:47 PM IST
Shabad
X

Shabad: ప్రధాని మోదీ బర్త్‌డే: షాబాద్ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ!

షాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని షాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బీజేపీ మండల అధ్యక్షుడు మద్దూరి మానయ్య ఆధ్వర్యంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మానయ్య మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాల ఆనందంగా ఉందన్నారు. రోగులకు పండ్లు పంపిణీ చేయడం ద్వారా మానవత్వాన్ని చాటుకోవడంతో పాటు, సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ప్రజల సంక్షేమం కోసం నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కూతురు మహేందర్, లంబడి రాము,దాదే మహేశ్, రాజు తదితరులు పాల్గొన్నారు.

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA