Miyapur: మియాపూర్ హోటల్ గదిలో పీజీ వైద్య విద్యార్థిని అనుమానాస్పద మృతి!
Miyapur: మియాపూర్‌లోని ఓ హోటల్ గదిలో హనుమకొండ పీజీ వైద్య విద్యార్థిని కొమటి స్రిజన అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Miyapur: మియాపూర్ హోటల్ గదిలో పీజీ వైద్య విద్యార్థిని అనుమానాస్పద మృతి!
Miyapur:హనుమకొండలో పీజీ పీడియాట్రిక్స్ మొదటి సంవత్సరం చదువుతున్న స్రిజన సెప్టెంబర్ 30న హైదరాబాద్‌కు వచ్చారు. ఆ తర్వాత ఆమె కనిపించకుండా పోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. స్రిజన మొబైల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. మియాపూర్‌లోని 'హోటల్ గ్రాండ్ బ్రోచిల్'లోని 502వ గదిలో ఆమె ఉన్నట్లు గుర్తించారు. హోటల్ సిబ్బంది సాయంతో స్పేర్ కీతో తలుపు తెరిచి చూడగా, మంచంపై స్రిజన మృతదేహం లభ్యమైంది.
కాగా, రవి కుమార్ అనే వ్యక్తి గతంలో తన కుమార్తె వద్ద నుంచి బంగారు గొలుసు తీసుకున్నాడని, ఆ విషయమై మాట్లాడేందుకే ఆమె హైదరాబాద్ వచ్చినట్లు మృతురాలి తండ్రి కె. భూమయ్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.




