Petbasheerabad: వ్యాపారి సేమారం చౌదరి హత్య కేసును ఛేదించిన పోలీసులు

Petbasheerabad: కుత్బుల్లాపూర్ పేట్ బషీరాబాద్ పరిధిలో వ్యాపారి సేమారం చౌదరి హత్య కేసును పోలీసులు ఛేదించారు. రూ.30 లక్షల వివాదంతో చంపిన ఇద్దరిని అరెస్ట్ చేశారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 11 Oct 2026 2:27 PM IST
Petbasheerabad
X

Petbasheerabad: వ్యాపారి సేమారం చౌదరి హత్య కేసును ఛేదించిన పోలీసులు

కుత్బుల్లాపూర్: పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యాపారి సేమారం చౌదరి హత్య కేసును ఛేదించిన పోలీసులు. నిందితులు సయ్యద్ ఉల్మాస్ హొస్సేనీ (A1), పీక్ పటు హమద్ (A2)లను అరెస్ట్ చేసినట్లు వెల్లడించిన మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి.

ఆర్థిక వివాదాలు, రూ. 30 లక్షల పెట్టుబడి డబ్బుల గొడవ వల్లే హత్య జరిగినట్లు తెలిపిన ఏసీపీ శంకర్ రెడ్డి. పూజలు నిర్వహిస్తామని నమ్మించి, యాచారం నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి గొంతు నులిమి చంపిన నిందితులు.

మృతదేహాన్ని పొదల్లో పడేసి, ఫోన్‌ను షామీర్‌పేట్ చెరువులో పడేసి సాక్ష్యాలు నాశనం చేసేందుకు యత్నం. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించిన 8 ప్రత్యేక పోలీసు బృందాలు. నిందితుల నుంచి రూ. 1.80 లక్షల నగదు, 2 స్మార్ట్‌ఫోన్‌లు, క్రైమ్‌కి వాడిన ఆటో స్వాధీనం.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR