Ghatkesar: ఘట్కేసర్లో ద్విచక్రవాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం!
Ghatkesar: ఘట్కేసర్ పోలీస్స్టేషన్ పరిధిలోని అవుషాపూర్లో బైక్ ఢీకొని తొర్రి సుధాకర్ (44) అనే వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.
Ghatkesar: ఘట్కేసర్లో ద్విచక్రవాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం!
Ghatkesar: ద్విచక్రవాహనం ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ పోలీస్స్టేషన్ పరిధిలోని అవుషాపూర్లో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని శ్రుతినగర్కు చెందిన తొర్రి సుధాకర్ (44) స్థానికంగా టెంట్హౌస్లో పనిచేస్తున్నాడు.
అతని స్నేహితులైన అయ్యప్పమాలధారులు శుక్రవారం భువనగిరి నుంచి శబరిమలకు పాదయాత్రగా బయలుదేరారు. రాత్రి 8 గంటల సమయంలో అవుషాపూర్ చేరుకున్న వారిని సుధాకర్ కలిశాడు. ఆశీర్వచనం తీసుకుని వారితో కలిసి కిలోమీటరు మేర నడిచి వస్తుండగా శ్రీనిధి రిసార్ట్స్ కమాన్ వద్ద ఘట్కేసర్ వైపు నుంచి వచ్చిన బైక్ అతడిని బలంగా ఢీకొట్టింది.
తలకు తీవ్ర గాయాలై, అధిక రక్తస్రావంతో సుధాకర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న ఘట్ కేసర్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




