Hayathnagar: సీతారాముల సన్నిధిలో మంచిరెడ్డి కిషన్రెడ్డి, క్యామ మల్లేష్!
Hayathnagar: పెద్ద అంబర్పేట్ సాయినగర్ కాలనీలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ విగ్రహ ప్రాణప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠ ఘనంగా జరిగాయి.
Hayathnagar: సీతారాముల సన్నిధిలో మంచిరెడ్డి కిషన్రెడ్డి, క్యామ మల్లేష్!
పెద్ద అంబర్పేట్, అక్టోబర్ 14: పెద్ద అంబర్పేట్ డివిజన్ పరిధిలోని సాయినగర్ కాలనీలో ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి, సాయిబాబా దేవాలయంలో విగ్రహ ప్రాణప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి క్యామ మల్లేష్ హాజరయ్యారు. వారికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఇబ్రహీంపట్నం ముద్దుబిడ్డ దండెం రాంరెడ్డి, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం ముఖ్య అతిథులు శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంచిరెడ్డి కిషన్రెడ్డి, క్యామ మల్లేష్లను దండెం రాంరెడ్డి, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ శ్రీ సీతారాముల దివ్య ఆశీస్సులతో పెద్ద అంబర్పేట్ ప్రాంత ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. ఆలయ ప్రతిష్ఠా మహోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.




