Malkajgiri: మౌలాలి వద్ద రోడ్డు ప్రమాద బాధితుడిని ఆసుపత్రికి తరలించిన మహేందర్ రెడ్డి!
Malkajgiri: మల్కాజ్‌గిరి మౌలాలి ఆనంద్ బాగ్ వద్ద రోడ్డు ప్రమాదానికి గురైన బాధితుడిని ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి వెంటనే ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు.
Malkajgiri: మౌలాలి వద్ద రోడ్డు ప్రమాద బాధితుడిని ఆసుపత్రికి తరలించిన మహేందర్ రెడ్డి!
Malkajgiri: మల్కాజ్గిరి కొత్త పెన్షన్ల పంపిణీ కోసం వెళుతున్న శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు.
మౌలాలి పరిసర ఆనంద్ బాగ్ ప్రాంతంలో రోడ్డు ప్రమాదానికి గురైన అచేతనంగా పడిఉన్న వరంగల్ నివాసి సురేష్ పరిస్థితిని చూసి ఆయన చెలించిపోయారు.
వెంటనే వాహనాలను ఆపి సురేష్ కు తక్షణ వైద్యం అందేలా చూశారు. స్థానిక ట్రాఫిక్ సిబ్బంది, తన వ్యక్తిగత భద్రత సిబ్బందితో కలిసి పోలీస్ వాహనంలో బాధితుని ఆసుపత్రికి తరలించారు. కూరగాయల వ్యాపారం చేసే సురేష్ మార్కెట్ కి వెళ్తుండగా లారీ ఢీ కొన్నదని బాధితుడు తెలిపారు.
బాధితుడు సురేష్ ను గాంధీ ఆసుపత్రికి తరలించాలని మహేందర్ రెడ్డి ఆదేశించారు. మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ సైతం మహేందర్ రెడ్డి కి తోడుగా నిలిచారు. ఆసుపత్రి వర్గాలకు సైతం ఫోన్ చేసి బాధితుని పరిస్థితిని వివరించి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
తనకు సాయం చేసిన మహేందర్ రెడ్డి కి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నిబంధనలను పాటించాలని, ప్రమాదాలను తగ్గించాలని మహేందర్ రెడ్డి ప్రజలకు సూచించారు. మహేందర్ రెడ్డి చాటుకున్న మానవత్వం చూసి స్థానికులు కొనియాడారు.




