Tandur: విశ్వకర్మ ఆలయ అభివృద్ధికి సహకరిస్తా పట్నం మహేందర్ రెడ్డి!
Tandur: తాండూర్ శ్రీరాట్ విశ్వకర్మ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి. విశ్వకర్మ దేవాలయ అభివృద్ధికి ఎల్లవేళలా సహకరిస్తానని హామీ.
Tandur: విశ్వకర్మ ఆలయ అభివృద్ధికి సహకరిస్తా పట్నం మహేందర్ రెడ్డి!
Tandur: తాండూరు లో శ్రీశ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి మహోత్సవాలలో శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.
అనంతరం మాట్లాడుతూ విశ్వకర్మ దేవాలయం అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లవేళలా ఉంటుందని తెలిపారు.గతంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు విశ్వకర్మల కోసం మూడు ఎకరాలు స్థలాన్ని 10 లక్షల సొంత నిధులతో ఇప్పించినట్లు గుర్తు చేశారు. దేవాలయం నిర్మాణంతో పాటు, ప్రధాన రహదారి నుండి దేవాలయం వరకు రోడ్డు నిర్మాణం తో పాటు అవసరమైన ప్రహరీ గోడ తదితర మౌలిక సదుపాయాలకు తాను ఎల్లవేళలా ముందు ఉంటానని చెప్పారు. విశ్వకర్మలు రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా దేవాలయాన్ని నిర్మించుకోవాలన్నారు.
తాండూర్ విశ్వకర్మ సంఘం గౌరవ అధ్యక్షుడు కరణం పురుషోత్తం రావు, సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీనివాసచారి తదితరులు మాట్లాడుతూ గతంలో మహేందర్ రెడ్డి మంత్రిగా చేసిన సేవలను కొనియాడారు దేవాలయం అభివృద్ధికి మరింత సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు శంకర్ యాదవ్ ,రాజకుమార్, శ్రీనివాస చారి, మధులత తదితరులు పాల్గొన్నారు.




