Hyderabad: పార్ట్‌టైం అధ్యాపకుల సమస్యలు పరిష్కరించాలి: విద్యా మండలికి వినతి!

Hyderabad: వర్సిటీ పార్ట్‌టైం అధ్యాపకుల సమస్యలపై ఉన్నత విద్యా మండలికి వినతిపత్రం సమర్పించిన అసోసియేషన్ ప్రతినిధులు. సమస్యల పరిష్కారానికి హామీ.

HARISH, TARNAKA
Published on: 12 Oct 2026 6:34 PM IST
Hyderabad
X

Hyderabad: పార్ట్‌టైం అధ్యాపకుల సమస్యలు పరిష్కరించాలి: విద్యా మండలికి వినతి!

Hyderabad: తెలంగాణలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న పార్ట్‌టైం అధ్యాపకుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ పార్ట్‌టైం టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సోమవారం ఉన్నత విద్యా మండలి చైర్మన్, వైస్ చైర్మన్‌లకు వినతిపత్రం సమర్పించారు. పార్ట్‌టైం అధ్యాపకులకు 12 నెలల పాటు కన్సాలిడేటెడ్ వేతనం చెల్లించాలని, యూనివర్సిటీ నియామకాల్లో 1:50 నిష్పత్తి ప్రకారం ఇంటర్వ్యూలకు పిలవాలని, అనుభవం ఆధారంగా ఇంటర్వ్యూల్లో వెయిటేజీ కల్పించాలని వారు కోరారు. దీనిపై ఉన్నత విద్యా మండలి చైర్మన్ స్పందిస్తూ, అధ్యాపకుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంతవరకు పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ సూరేపల్లి వెంకటరత్నం, డాక్టర్ జానకిరెడ్డి, డాక్టర్ జీవన్, డాక్టర్ పండారెడ్డి, డాక్టర్ గంగాధర్, డాక్టర్ రాయకింది సతీష్, డాక్టర్ కే. వీరుయాదవ్, ఎన్. శ్రీను, ఎర్రోళ్ల లక్ష్మణ్, డాక్టర్ ఎం.డి. పసుద్దీన్, డాక్టర్ ఎం.డి. అలీ, డాక్టర్ ప్రకాష్, డాక్టర్ బిక్షపతి, డాక్టర్ యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.

HARISH, TARNAKA

HARISH, TARNAKA