Pargi: వికారాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ పోలీస్ వాహనం బోల్తా!

Pargi: వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట్ సమీపంలో సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ పెట్రోలింగ్ పోలీస్ వాహనం బోల్తా. ఎస్ఐ సత్యనారాయణ, డ్రైవర్‌కు గాయాలు.

WAZID, PARIGI
Published on: 10 Nov 2026 8:15 AM IST
Pargi
X

Pargi: వికారాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ పోలీస్ వాహనం బోల్తా!

Pargi: వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట్ సమీపంలో పోలీస్ వాహనం బోల్తా పడిన ఘటన కలకలం రేపింది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కు సంబంధించి పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న పోలీస్ వాహనం అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. ఈ వాహనంలో పరిగి పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్ఐ సత్యనారాయణ తో పాటు డ్రైవర్ ఉన్నట్లు సమాచారం.ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, వాహనంలో చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీశారు. అనంతరం వారిని చికిత్స నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. అయితే పోలీస్ వాహనం అదుపుతప్పి బోల్తా పడటానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

WAZID, PARIGI

WAZID, PARIGI