Pargi: పరిగిలో కారుపై కూర్చొని హంగామా.. నలుగురిపై కేసు నమోదు!
Pargi: పరిగి జాతీయ రహదారి NH-163పై కారుపై కూర్చొని ప్రమాదకర విన్యాసాలు చేసిన నలుగురు యువకులపై హెచ్‌ఎంటీవీ కథనంతో పరిగి పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
Pargi: పరిగిలో కారుపై కూర్చొని హంగామా.. నలుగురిపై కేసు నమోదు!
PARGI: పరిగి పట్టణంలో కారుపై కూర్చొని కేకలు వేస్తూ, అజాగ్రత్తగా కారు నడిపిన ఘటనపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురిపై కేసు నమోదు చేశారు.ఇటీవల పరిగి పట్టణ పరిధిలోని జాతీయ రహదారి NH-163పై కొందరు యువకులు కారుపై కూర్చొని కేకలు వేస్తూ హల్‌చల్ చేశారు.
అంతేకాకుండా కారును అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ రహదారిపై వెళ్లే ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలిగించినట్లు పోలీసులు గుర్తించారు.ఈ ఘటనపై HMTVలో ప్రసారమైన వార్తకు స్పందించిన పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు. కారు డ్రైవర్‌తో పాటు కారులో ఉన్న మరో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి, సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.రహదారులపై ఇలాంటి ప్రమాదకరమైన చర్యలకు పాల్పడితే ఇతరుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.




