Pargi: పరిగిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి ఉమా!
Pargi: పరిగిలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే సతీమణి ఉమా రామ్మోహన్ రెడ్డి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి సందడి చేశారు.
Pargi: పరిగిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి ఉమా!
పరిగి: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పరిగి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పరిగి మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బతుకమ్మ సంబరాల్లో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి సతీమణి ఉమా రామ్మోహన్ రెడ్డి పాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ వేడుకల్లో సందడి చేశారు.
ఈ సందర్భంగా మహిళలతో కలిసి రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి, భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం సంప్రదాయ పద్ధతిలో బతుకమ్మ ఆడుతూ మహిళలతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు.తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఉమా రామ్మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పరిగి మున్సిపల్ చైర్మన్ రజిత వెంకటేష్ ,మార్కెట్ కమిటీ చైర్మన్ పరుశురాం రెడ్డి,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అయ్యూబ్,కౌన్సిలర్ అఖిల బాదం శ్రీనివాస్ ,స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ పాటలు, ఆటలతో వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు.




