Pargi: పరిగిలో ₹8 కోట్ల మున్సిపల్ భవన పనుల పరిశీలన ఎమ్మెల్యే రామ్మోహన్
Pargi: పరిగిలో రూ. 8 కోట్లతో నిర్మిస్తున్న మున్సిపల్ భవన పనులను ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పరిశీలించారు. పనుల్లో నాణ్యత పాటిస్తూ త్వరగా పూర్తిచేయాలని ఆదేశం.
Pargi: పరిగిలో ₹8 కోట్ల మున్సిపల్ భవన పనుల పరిశీలన ఎమ్మెల్యే రామ్మోహన్
పరిగి: వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో ఎనిమిది కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న నూతన మున్సిపల్ భవన నిర్మాణ పనులను పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి పరిశీలించారు.
స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించిన ఎమ్మెల్యే.. పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పెరుగుతున్న పట్టణ అవసరాలకు అనుగుణంగా అన్ని ఆధునిక సౌకర్యాలతో నూతన మున్సిపల్ భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు.
మున్సిపల్ పరిపాలన మరింత సమర్థవంతంగా సాగేందుకు, ప్రజలకు అన్ని రకాల మున్సిపల్ సేవలు ఒకేచోట అందుబాటులో ఉండేందుకు ఈ భవనం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ.. ఎలాంటి జాప్యం లేకుండా పనులను పూర్తి చేసి, వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు సూచించారు.




