Pargi: శబరిమల యాత్రికులకు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వీడ్కోలు!

Pargi: పరిగి నుంచి శబరిమలకు పాదయాత్రగా బయలుదేరిన అయ్యప్ప భక్తులను ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. యాత్ర సజావుగా సాగాలని ఆకాంక్షించారు.

WAZID, PARIGI
Published on: 26 Oct 2026 6:47 PM IST
Pargi
X

Pargi: శబరిమల యాత్రికులకు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వీడ్కోలు!

PARGI: వికారాబాద్ జిల్లా పరిగి పట్టణం నుంచి శబరిమల అయ్యప్ప స్వామి దర్శనార్థం పాదయాత్రగా బయలుదేరిన అయ్యప్ప స్వాములను పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి ఆత్మీయంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములు చేపట్టిన పాదయాత్ర విజయవంతంగా పూర్తికావాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. స్వామివారి దివ్య దర్శనాన్ని ప్రశాంతంగా చేసుకుని, ఎలాంటి ఆటంకాలు లేకుండా యాత్రను పూర్తి చేసుకుని క్షేమంగా తిరిగి రావాలని కోరుకున్నారు. అలాగే అయ్యప్ప స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ప్రార్థించారు.

WAZID, PARIGI

WAZID, PARIGI