Pargi: పరిగి నియోజకవర్గ వార్డు మెంబర్ ఫోరం కో ఇన్ఛార్జిగా ఎల్. శ్రీనివాస్!
Pargi: వికారాబాద్ జిల్లా వార్డు మెంబర్స్ ఫోరం పరిగి నియోజకవర్గ కో ఇన్ఛార్జిగా ఎల్. శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక. నియామక పత్రం అందజేసిన నాగబెల్లి జ్యోతి.
Pargi: పరిగి నియోజకవర్గ వార్డు మెంబర్ ఫోరం కో ఇన్ఛార్జిగా ఎల్. శ్రీనివాస్!
Pargi: వికారాబాద్ జిల్లా వార్డు మెంబర్స్ ఫోరంలో నూతన నియామకం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వార్డు మెంబర్స్ ఫోరం అధ్యక్షురాలు నాగబెల్లి జ్యోతి మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా వార్డు మెంబర్స్ ఫోరం నూతన కమిటీని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా పరిగి నియోజకవర్గ వార్డు మెంబర్ ఫోరం కో ఇంచార్జి గా ఎల్. శ్రీనివాస్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ నియామకానికి సంబంధించిన పత్రాన్ని నాగబెల్లి జ్యోతి మహేష్ చేతుల మీదుగా అందజేశారు.జిల్లాలోని వార్డు మెంబర్ల సమస్యల పరిష్కారానికి, వారి హక్కుల సాధనకు కృషి చేస్తూ, వార్డు మెంబర్లందరినీ సమన్వయం చేసుకుంటూ ఫోరం బలోపేతానికి కృషి చేయాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.




