Pargi: పరిగిలో కాంగ్రెస్ నేతపై పోలీస్ దాడి కలకలం
Pargi: పరిగి పోలీస్ స్టేషన్‌లో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి దాడి చేశారని టౌన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బుర్కని బాలకృష్ణ సంచలన ఆరోపణలు చేశారు.
Pargi: పరిగిలో కాంగ్రెస్ నేతపై పోలీస్ దాడి కలకలం
Pargi: వికారాబాద్ జిల్లా పరిగిలో వినాయక నిమజ్జనం సందర్భంగా చోటుచేసుకున్న వివాదం ఇప్పుడు మరో మలుపు తిరిగింది.వినాయక నిమజ్జనం సమయంలో పరిగి PACS చైర్మన్ పార్థసారథికి, టౌన్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ బుర్కని బాలకృష్ణకు మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం.
ఈ ఘటన అనంతరం తాను పార్థసారథికి క్షమాపణలు చెప్పినప్పటికీ... పోలీసులు తనను పరిగి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారని బుర్కని బాలకృష్ణ ఆరోపించారు.అంతేకాదు... పోలీస్ స్టేషన్‌లో తన బట్టలు ఊడదీసి విచక్షణారహితంగా కొట్టి, చిత్రహింసలకు గురిచేశారని బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.తనపై పోలీసులు ఎందుకు ఇంత దారుణంగా వ్యవహరించారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
“ఎవరి మద్దతుతో పోలీసులు తనపై దాడి చేశారో తెలియాలి... 26 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న తనకు దక్కిన గౌరవం ఇదేనా?” అంటూ బాలకృష్ణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.ఎవరికో వీడియో కాల్ చేస్తూ వారికి చూపిస్తూ మరి తన్ను కొట్టారని ఆరోపించాడు. ఈ విషయం ఎవరికైనా చెప్పితే మళ్ళీ కొడతామని బెదిరించారని తెలిపారు..తనపై జరిగినట్లు చెబుతున్న దాడిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతున్నారు.
అయితే ఈ ఆరోపణలపై పోలీసుల నుంచి అధికారిక వివరణ రావాల్సి ఉంది.
మొత్తానికి... వినాయక నిమజ్జనం సందర్భంగా మొదలైన వివాదం, ఇప్పుడు పోలీసులపై కాంగ్రెస్ నేత చేసిన తీవ్ర ఆరోపణలతో పరిగిలో చర్చనీయాంశంగా మారింది.




