Talakondapally: తలకొండపల్లిలో ఘనంగా దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి

Talakondapally: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి ఘనంగా నిర్వహించి ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 25 Sept 2026 2:53 PM IST
Talakondapally
X

Talakondapally: తలకొండపల్లిలో ఘనంగా దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి

రంగారెడ్డి జిల్లా: తలకొండపల్లి మండలం అంత్యోదయ, ఏకాత్మ మానవతావాద సిద్ధాంతాలు సమాజానికి ఆదర్శం భారతీయ జనతా పార్టీ తలకొండపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

మండల అధ్యక్షుడు నీలకంఠం పాండు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని దీనదయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన ‘అంత్యోదయ’, ‘ఏకాత్మ మానవతావాదం’ సిద్ధాంతాలు నేటి సమాజానికి ఎంతో ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.

సమాజంలో అట్టడుగున ఉన్న చివరి వ్యక్తి అభివృద్ధి చెందే వరకు కృషి చేయడమే నిజమైన ప్రజాసేవ అని అన్నారు. దీనదయాళ్ ఉపాధ్యాయ ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పెరుమాళ్ల రాజు, మాజీ ఉపసర్పంచ్, బీజేవైఎం నాయకులు పద్మ అనిల్ ముదిరాజ్, బండి యాదయ్య, బొల్లా శ్రీను, సిద్ధయ్య, డాక్టర్ ప్రసాద్, తిరుమని గణేష్ గౌడ్, ఈసరి బాలకృష్ణ, కటుమల విజయ్ కుమార్, ఇస్లావత్ వెంకటేష్ నాయక్, కృష్ణ, మహేందర్, సురేష్, పరమేష్, రాము, కుమార్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY