Hyderabad: యువత గంజాయి, డ్రగ్స్ వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి!

Hyderabad: ఫిలింనగర్‌లో జరిగిన దసరా పీజీ క్రికెట్‌ టోర్నమెంట్‌ బహుమతుల ప్రదానోత్సవంలో ఖైరతాబాద్‌ సీనియర్‌ నేత పల్లపు గోవర్ధన్‌ పాల్గొన్నారు.

RAJESH,	WEST ZONE
Published on: 26 Oct 2026 1:31 PM IST
Hyderabad
X

Hyderabad: యువత గంజాయి, డ్రగ్స్ వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి!

Hyderabad: యువత దేశానికి వెన్నెముకలాంటివారని అలాంటి యువత నేడు గంజాయి, డ్రగ్స్‌లాంటి వాటికి ఆకర్షితులవుతుండటం బాధాకరమని భాగ్యనగర్‌ ఉత్సవ సమితి కార్యదర్శి, ఖైరతాబాద్‌ సీనియర్‌ నేత పల్లపు గోవర్ధన్‌ అన్నారు. దసరా పీజీ క్రికెట్‌ టోర్నమెంట్‌ బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం ఫిలింనగర్‌లోని గౌతంనగర్‌ చౌరస్తాలో ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా ఆయన గెలుపొందిన జట్లతో పాటు రన్నరప్‌ జట్టుకు, మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్, మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ ట్రోఫీలను ఆయన యువతకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువతను ప్రోత్సహించడానికి, యువత చెడుమార్గంలో వెళ్ళకుండా ఉండేందుకే తాను ప్రతియేటా క్రికెట్‌ టోర్నమెంట్లు నిర్వహిస్తున్నానని అన్నారు.

ఫిలింనగర్ బస్తీలో పుట్టి పెరిగిన తనకు బస్తీల్లో ఉండే యువత కష్టాలు తెలుసునని అందుకే వారు ఎటువంటి చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా ఉండాలని తాపత్రయంతో క్రికెట్ టోర్నమెంట్ లను నిర్వహిస్తున్నానని తెలిపారు. 15 రోజుల పాటు నిర్వహించిన ఈ టోర్నమెంట్‌లో బస్తీల నుంచి యువత 19 జట్లు పాల్గొనగా 47 మ్యాచ్‌లో నిర్వహించినట్లు ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా గెలుపొందిన జట్టు ఫ్రెండ్స్‌ ప్లేయింగ్‌కు రూ.50 వేల బహుమతితో పాటు ట్రోఫీ, రన్నరప్‌ దుర్గా భవానీనగర్‌ కుమార్‌ జట్టుకు రూ.30 వేల నగదు పురస్కారంతో పాటు ట్రోఫీలను అందజేశారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE