Hyderabad: చేనేత కళాకారులకు సర్టిఫికెట్లు అందజేసిన పద్మశ్రీ పద్మజారెడ్డి!

Hyderabad: హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో నిర్వహించిన 'షీ-స్టేట్ హ్యాండ్లూమ్ ఎక్స్పో' ముగింపు వేడుకల్లో పద్మశ్రీ పద్మజారెడ్డి పాల్గొని చేనేత కళాకారులకు సర్టిఫికెట్లను అందజేశారు.

RAJESH,	WEST ZONE
Published on: 28 Oct 2026 9:50 AM IST
Hyderabad
X

Hyderabad: చేనేత కళాకారులకు సర్టిఫికెట్లు అందజేసిన పద్మశ్రీ పద్మజారెడ్డి!

Hyderabad: చేనేత కారుల ఉత్పత్తులను ధరించి వారిని ప్రోత్సహించాలని పద్మశ్రీ పద్మజారెడ్డి అన్నారు. శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమంలో రాష్ట్ర చేనేత వస్త్ర ప్రదర్శన (షీ-స్టేట్ హ్యాండ్లూమ్ ఎక్స్పో) వస్త్ర ప్రదర్శన ముగింపు వేడుకల్లో ఆమె పాల్గొని చేనేత కళాకారులకు సత్కరించి సర్టిఫికెట్లను అందజేశారు.

ఇలాంటి ప్రభుత్వ ప్రదర్శనలతో చేనేతకారులకు మరింత గుర్తింపు వస్తుందన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రముఖ నగరాలకు చెందిన చేనేత ఉత్పత్తులను సుమారు 76 స్టాళ్లలో ప్రదర్శించారు. చేనేతకారుల ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అందించాలనే సదుద్దేశంతో ఈ చేనేత మేళాను ఏర్పాటుచేశామని నిర్వాహకులు తెలిపారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE