Tarnaka: లాలాపేట డబుల్ బెడ్రూమ్ ఇళ్ల జాప్యంపై పద్మారావు గౌడ్ అసంతృప్తి!
Tarnaka: లాలాపేట సాయినగర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు, పనుల జాప్యంపై ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
Tarnaka: లాలాపేట డబుల్ బెడ్రూమ్ ఇళ్ల జాప్యంపై పద్మారావు గౌడ్ అసంతృప్తి!
Tarnaka: తార్నాక ఇందిరమ్మ ఇళ్ళ పేరిట పక్కా ఇళ్ళ పధకాలను అమలు జరుపుతున్న దశలో సికింద్రాబాద్ నియోజకవర్గంలో సైతం హౌజింగ్ స్కీం పనులను చేపట్టి నిరుపేదలకు ఇళ్ళను అందించేందుకు ఏర్పాట్లు జరపాలని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అధికారులను ఆదేశించారు.
సోమవారం లాలాపేట లోని సాయి నగర్ లో రెండు పడకల ఇళ్ళ నిర్మాణాల కేటాయింపును పద్మారావు గౌడ్ సమీక్షించారు. రూ. తొమ్మిది కోట్ల ఖర్చుతో వివిధ వర్గాలను ఒప్పించి 10 4 ఇళ్ళను మూడు అంతస్తుల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను సాయినగర్ లో నిర్మించామని, ఇళ్ళ నిర్మాణం, కేటాయింపులో జాప్యం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.
తాసిల్దార్ అస్మతుల్లా ఖాన్, డీ ఈ లు లలిత, హేము నాయక్, అధికారులు, బీ.ఆర్.ఎస్. యువ నేత , రామేశ్వర్ గౌడ్ నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పనుల్లో నాణ్యతను పాటించడంతో పాటు వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. డబుల్ బెడ్ రూమ్ ప్రాజెక్టు వద్ద అన్ని మౌలిక వసతులను కల్పించాలని ఆదేశించారు.
జాప్యం నివారించాలని, లేని పక్షంలో సంబంధిత వ్యక్తుల పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిబంధనల మేరకు పేదలను లబ్దిదారులుగా ఎంపిక చేసి ఇళ్ళను కేటాయించాలని అధికారులను ఆదేశించారు. లబ్దిదారులతో ముచ్చటించి వారి సాధక బాధకాలను తెలుసుకున్నారు. వారికి తగిన న్యాయం చేకురుస్తామని పేర్కొన్నారు.




