Kadthal: మైసిగండి మైసమ్మ ఆలయాన్ని దర్శించుకున్న గూడూరు శ్రీనివాస్ రెడ్డి!

Kadthal: కడ్తాల్ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మైసిగండి మైసమ్మ అమ్మవారిని ఆమనగల్లు పీఏసీఎస్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 14 Nov 2026 12:08 PM IST
Kadthal
X

Kadthal: మైసిగండి మైసమ్మ ఆలయాన్ని దర్శించుకున్న గూడూరు శ్రీనివాస్ రెడ్డి!

Kadthal: ఆధ్యాత్మిక చింతన మనిషికి మానసిక ప్రశాంతతను, ఆత్మసంతృప్తిని అందించి ఆనందమయ జీవితానికి మార్గం చూపుతుందని ఆమనగల్లు పీఏసీఎస్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దైవభక్తి, ఆధ్యాత్మిక విలువలు ప్రతి ఒక్కరిలో మానవత్వాన్ని, సానుకూల ఆలోచనలను పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు.

కడ్తాల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మైసిగండి మైసమ్మ దేవాలయాన్ని శుక్రవారం శ్రీనివాస్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

అనంతరం ఆలయ నిర్వాహకులు ఆలయ మర్యాదలతో ఆయనను సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ దేవాలయాలు కేవలం పూజా స్థలాలే కాకుండా ఆధ్యాత్మిక చింతనకు, సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు నిలయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధితో పాటు పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. ప్రతి ఒక్కరూ దైవ కార్యక్రమాల్లో భాగస్వాములై ఆధ్యాత్మిక భావాలను అలవర్చుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కడ్తాల ఉపసర్పంచ్ ఈరెడ్డి యాదగిరి రెడ్డి, మాజీ ఎంపీటీసీ గురిగళ్ల లక్ష్మయ్య, కడ్తాల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మాలే మల్లేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY