Talakondapally: రామకృష్ణాపురంలో సొంత నిధులతో బస్టాండ్ నిర్మిస్తున్న పీఏసీఎస్ చైర్మన్!

Talakondapally: రామకృష్ణాపురంలో ప్రయాణికుల ఇబ్బందులు తీర్చేందుకు పీఏసీఎస్ చైర్మన్ గట్ల కేశవరెడ్డి సొంత నిధులతో బస్టాండ్ నిర్మాణ పనులు ప్రారంభించారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 14 Nov 2026 2:57 PM IST
Talakondapally
X

Talakondapally: రామకృష్ణాపురంలో సొంత నిధులతో బస్టాండ్ నిర్మిస్తున్న పీఏసీఎస్ చైర్మన్!

Talakondapally: తలకొండపల్లి గ్రామ ప్రజల చిరకాల సమస్యను పరిష్కరించేందుకు తలకొండపల్లి మండల పీఏసీఎస్ చైర్మన్ గట్ల కేశవరెడ్డి తన సొంత నిధులతో బస్టాండ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల పరిధిలోని రామకృష్ణాపురం గ్రామంలో బస్టాండ్ సదుపాయం లేక ప్రయాణికులు, విద్యార్థులు, మహిళలు ఎండకు, వానకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలో కేశవరెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

నిర్మాణ పనుల్లో భాగంగా శనివారం బస్టాండ్ స్లాబ్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా గట్ల కేశవరెడ్డి మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. బస్టాండ్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు.

బస్టాండ్ ఏర్పడుతుండడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాసు శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు భాగ్యలక్ష్మి, లక్ష్మయ్య, బి.శేఖర్, సింగిల్ విండో డైరెక్టర్ శ్యాంసుందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోతిరెడ్డి అచ్చిరెడ్డి, శేఖర్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ప్రభాకర్ రెడ్డి, నాయకులు మహేష్, బాబు, ముత్యాలు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY