Hyderabad: ఉస్మానియా యూనివర్సిటీలో నాన్ టీచింగ్ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు!

Hyderabad: ఉస్మానియా యూనివర్సిటీలో నాన్ టీచింగ్ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం పరిపాలనా భవనం ఎదుట రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు.

HARISH, TARNAKA
Published on: 18 Nov 2026 7:49 AM IST
Hyderabad
X

Hyderabad: ఉస్మానియా యూనివర్సిటీలో నాన్ టీచింగ్ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు!

Hyderabad: ఉస్మానియా యూనివర్సిటీలో నాన్‌ టీచింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పరిపాలనా భవనం ఎదుట రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. దీక్షలకు బీజేపీ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య సంఘీభావం తెలిపి, ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధనకు బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ఏళ్ల తరబడి విశ్వవిద్యాలయానికి సేవలందిస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత యూనివర్సిటీ యాజమాన్యంపై ఉందని పేర్కొన్నారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను అధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

ఉద్యోగులకు న్యాయం జరిగే వరకు వారి పోరాటానికి పార్టీ మద్దతు కొనసాగుతుందని కొమురయ్య స్పష్టం చేశారు. ఓపీఎస్‌ అమలు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, అంతర్గత పదోన్నతులు, ఖాళీ పోస్టుల భర్తీ, ఈపీఎఫ్‌ బకాయిల చెల్లింపు, వైద్య ఖర్చుల విడుదల తదితర డిమాండ్లను జేఏసీ నాయకులు ప్రభుత్వం, యూనివర్సిటీ అధికారుల ముందుంచారు. సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని ఉద్యోగులు స్పష్టం చేశారు.

ఈ రిలే నిరాహార దీక్షల్లో ఉపేందర్ సార్ (డిప్యూటీ రిజిస్ట్రార్), ఎన్జీవోస్ నుంచి మల్లేష్, టెక్నికల్ స్టాఫ్ అసోసియేషన్ నుంచి మల్లేష్, బిక్షపతి, మహేష్, బీఈడీ కాలేజీ నుంచి మహేశ్వరి, అడ్మిన్ బిల్డింగ్ నుంచి మెహర్, వినోద్, షేక్ ఫారుక్, ఎగ్జామినేషన్ బ్రాంచ్ నుంచి యరాల రాజేష్, పి. సురేష్, కె. శ్రీకాంత్, గెస్ట్ హౌస్ నుంచి శ్రీనివాస్ యాదవ్, టైమ్ స్కేల్ ఉద్యోగుల తరఫున శ్రీనివాస్ తదితరులు దీక్షలో కూర్చున్నారు.

HARISH, TARNAKA

HARISH, TARNAKA