Hyderabad: ఓయూ హాస్టళ్ల కూల్చివేతను నిలిపివేయాలి: రిజిస్ట్రార్‌కు వినతి!
Hyderabad: ఉస్మానియా యూనివర్సిటీలోని E1, D, E2 హాస్టళ్ల కూల్చివేతను నిలిపివేయాలని, విద్యుత్, నీటి సరఫరా పునరుద్ధరించాలని బీఆర్‌ఎస్‌వీ నేత జంగయ్య ఓయూ రిజిస్ట్రార్‌కు వినతిపత్రం ఇచ్చారు.
Hyderabad: ఓయూ హాస్టళ్ల కూల్చివేతను నిలిపివేయాలి: రిజిస్ట్రార్‌కు వినతి!
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలోని E1, D, E2 వసతి గృహాల కూల్చివేతను తక్షణమే నిలిపివేయాలని, ఆయా హాస్టళ్లకు విద్యుత్, నీటి సరఫరాను పునరుద్ధరించాలని కోరుతూ విద్యార్థి నేత జంగయ్య ఆధ్వర్యంలో ఓయూ రిజిస్ట్రార్‌కు వినతిపత్రం అందజేశారు. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తూ యూనివర్సిటీలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించిన రూ.1,000 కోట్ల నిధులను వెంటనే విడుదల చేసి, నూతన హాస్టళ్లు, ఆధునిక ల్యాబ్‌లు, సౌకర్యవంతమైన గదులు నిర్మించాలని డిమాండ్ చేశారు. అలాగే యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర కార్యదర్శి జంగయ్యతో పాటు నరేష్, వంశీ, శ్రవణ్, ప్రదీప్, ఫయాజ్, చరణ్, శ్రీనివాస్‌రెడ్డి, క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు.




