Medchal: మేడ్చల్‌లో జాతీయ రహదారి బ్లాక్ స్పాట్ల తనిఖీ!
Medchal: 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు తనిఖీలు చేపట్టారు. మేడ్చల్‌లోని బ్లాక్ స్పాట్లను అదనపు కలెక్టర్ ఫైజాన్ పరిశీలించారు.
Medchal: మేడ్చల్‌లో జాతీయ రహదారి బ్లాక్ స్పాట్ల తనిఖీ!
Medchal: 44వ జాతీయ రహదారిపై తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రమాదాలు అధికంగా జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్‌గా గుర్తించి, ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు.
ఈ క్రమంలో జిల్లా వైద్యశాఖ శాఖాధికారి డాక్టర్ ఆనంద్, ఏసీపీ శంకర్ రెడ్డి,అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ-2 ఎస్. శేఖర్ రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ వెంకటేశ్వర్లు రావు, మేడ్చల్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ ఎన్. లావణ్య, అసిస్టెంట్ ఉప్పల్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ ఎం. ఉపాసన, మేడ్చల్ రోడ్లు మరియు భవనాల శాఖ ఈఈ రంజిత్ కుమార్, సీపీసీ జీడిమెట్ల సర్కిల్ ఏఈ కే. గోపాలకృష్ణ, మేడ్చల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అంజిరెడ్డి, ఎల్లంపేట పురపాలక సంఘం కమిషనర్ కృష్ణారెడ్డి, కుత్బుల్లాపూర్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ కే. విజయ్ కుమార్, ఎన్‌హెచ్‌ఏఐ ఇంజినీర్లు ఏ. ఫైజల్ రసూల్, జి.వి. రావు తదితర అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు.
ఈ సందర్భంగా 44వ జాతీయ రహదారిపై ప్రమాదాలు జరిగే ప్రాంతాలను పరిశీలించి, ప్రమాదాలకు గల కారణాలను విశ్లేషించారు. రహదారిపై వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా, ప్రమాదాలు పునరావృతం కాకుండా అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని చర్చించారు.
ముఖ్యంగా ప్రమాదకర ప్రాంతాల్లో రోడ్డు భద్రతా ప్రమాణాలను మెరుగుపరచడం, అవసరమైన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం, సంబంధిత శాఖల సమన్వయంతో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవడంపై అధికారులు దృష్టి సారించారు.
ప్రజల ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులు పేర్కొన్నారు...




