Hyderabad: ఏలేటి మహేశ్వర్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరిన పాకాల రాంచందర్!
Hyderabad: నిర్మల్ కాంగ్రెస్ సీనియర్ నేత పాకాల రాంచందర్ శుక్రవారం హైదరాబాద్లో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు.
Hyderabad: ఏలేటి మహేశ్వర్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరిన పాకాల రాంచందర్!
హైదరాబాద్: నిర్మల్ కి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుల స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ పాకాల రాంచందర్ గారు తన ముఖ్య అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని వారి నివాసం లో రాష్ట్ర బీజేఎల్పీ నేత నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి వారికి కాషాయ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
పాకాల రాంచందర్ గారితో పాటు బి రాజు గౌడ్, ఎస్ పి రవి,పాకాల మణికంఠ, సాయి సందీప్, అభినవ్, సిద్ధార్థ్, ఆనంద్ వర్ధన్, భాస్కర్, భరత్విన్, క్షితిజ్, వంశీ, సాయి, విష్ణు, భీమ్ తదితరులు కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు.
ఈ సందర్భంగా పాకాల మాట్లాడుతూ గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అనుసరిస్తున్న వైఖరి, రాహుల్ గాంధీ చేపడుతున్న ఓటు చోరీ కార్యక్రమాల పట్ల తన అసంతృప్తిని ఆయన వ్యక్తం చేశారు.
అదేవిధంగా, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలంతో పాటు గౌరవ పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వం ఏర్పడి ఇంతకాలం గడిచినా ఆ హామీల అమలుపై ఆశించిన స్థాయిలో పురోగతి లేకపోవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అంశంపై కేశవరావు అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసినప్పటికీ హామీల అమలులో జాప్యం జరుగుతోందని పేర్కొన్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు పాకాల రామచందర్ తెలిపారు. తిరిగి సొంత పార్టీలోకి చేరుతున్నందుకు ఆనందంగా ఉందని ఆయన తెలిపారు.ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వం, బీజేపీ సిద్ధాంతాలు, దేశ అభివృద్ధి కోసం ,మహేశన్న నాయకత్వం లో బీజేపీ పార్టీకోసం మనస్ఫూర్తిగా పనిచేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రావుల రామ్నాథ్, కిసాన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి డి .ముత్యం రెడ్డి, మాజీ కౌన్సిలర్ ఆకోజి కిషన్, ధ్యాగ ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.




