Mansoorabad: వివేకానంద నగర్ నూతన కార్యవర్గానికి కాలనీవాసుల శుభాకాంక్షలు
Mansoorabad: మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ ఫేజ్–2 వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి స్థానిక ప్రముఖులు, కాలనీవాసులు శుభాకాంక్షలు తెలిపారు.
Mansoorabad: వివేకానంద నగర్ నూతన కార్యవర్గానికి కాలనీవాసుల శుభాకాంక్షలు
ఎల్బీనగర్: మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ ఫేజ్–2 వెల్ఫేర్ అసోసియేషన్ నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన చెరుకూరి కిరణ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన ఇర్రి విజయభాస్కర్ రెడ్డి, కోశాధికారిగా ఎన్నికైన బుర్రి మధుసూదన్ రెడ్డితో పాటు నూతన కార్యవర్గ సభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
నూతన కార్యవర్గం కాలనీ అభివృద్ధికి, కాలనీవాసుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ఐకమత్యంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కాలనీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, మౌలిక సదుపాయాల మెరుగుదలకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
నూతన కార్యవర్గం తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, వివేకానంద నగర్ ఫేజ్–2 అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షిస్తూ మరోసారి శుభాకాంక్షలు తెలిపారు.




