Malkajgiri: మైనంపల్లి హనుమంతరావు సహకారంతోనే నేరేడ్మెట్ డివిజన్ అభివృద్ధి!

Malkajgiri: మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సహకారంతో నేరేడ్మెట్ డివిజన్‌లోని జీకే కాలనీ, వివేకానందపురం, మాతృశ్రీపురంలో సీసీ రోడ్ల పనులను కాంగ్రెస్ నేతలు ప్రారంభించారు.

Bodike Manohar, Malkajgiri
Published on: 17 Nov 2026 3:11 PM IST
Malkajgiri
X

Malkajgiri: మైనంపల్లి హనుమంతరావు సహకారంతోనే నేరేడ్మెట్ డివిజన్ అభివృద్ధి!

మల్కాజిగిరి: మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సహకారంతోనే నేరేడ్మెట్ డివిజన్‌లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు తెలిపారు. గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సుమారు రూ.180 కోట్ల నిధులు తీసుకువచ్చి డివిజన్‌లో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని, ప్రస్తుతం కూడా ఆయన సహకారంతోనే కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

నేరేడ్మెట్ డివిజన్ పరిధిలోని జీకే కాలనీలో రూ.17 లక్షలు, వివేకానందపురంలో రూ.95 లక్షలు, మాతృశ్రీపురం కాలనీలో రూ.35 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను మాజీ కార్పొరేటర్ కొత్తపల్లి మీనా ఉపేందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు ఎస్.ఆర్. ప్రసాద్, ఇందిరా తదితరులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా నిలిచిపోయిన అభివృద్ధి పనులు మళ్లీ మైనంపల్లి హనుమంతరావు సహకారంతో వేగం పుంజుకుంటున్నాయని అన్నారు. గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో డివిజన్‌లో జరిగిన అభివృద్ధికి సంబంధించిన లిఖితపూర్వక ఆధారాలను చూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రస్తుత ఎమ్మెల్యే తన సొంత నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులతో చేపడుతున్న పనులకు ప్రారంభోత్సవాలు చేస్తూ, తామే నిధులు తీసుకువచ్చినట్లుగా ప్రచారం చేసుకోవడం సరికాదని విమర్శించారు.

గతంలో వేల కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత మైనంపల్లి హనుమంతరావుకే దక్కుతుందని, ప్రస్తుతం కూడా ఆయన సహకారంతోనే నేరేడ్మెట్ డివిజన్‌లోని కాలనీల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు రాఘవన్, కపిలేశ్వర్, పి. ఆశ, శంకర్రావు, రొట్టెల ధరన్, మధుసూదన్ రెడ్డి, జాన్, సాయి నరేష్, నారాయణ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, సతీష్, బాలరాజు యాదవ్, భాస్కర్, ప్రభ, మహాలక్ష్మి, విజయలక్ష్మి, సుధా నాయుడు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Bodike Manohar, Malkajgiri

Bodike Manohar, Malkajgiri