Kapra: కుషాయిగూడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శరన్నవరాత్రులు!

Kapra: కుషాయిగూడ శ్రీ పద్మావతి వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శరన్నవరాత్రోత్సవాలు, బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 11-21 వరకు వేడుకలు.

ASHOK, KAPRA
Published on: 11 Oct 2026 12:25 PM IST
Kapra
X

Kapra: కుషాయిగూడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శరన్నవరాత్రులు!

Kapra: కుషాయిగూడ శ్రీ పద్మావతి వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శరణవరాత్రోత్సవాలు, శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేశారు. అక్టోబర్ 11 నుంచి 21వ తేదీ వరకు వివిధ ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు, స్వామివారి కల్యాణోత్సవం, వాహన సేవలు తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

అక్టోబర్ 11న ఆదివారం ఉదయం 9 గంటలకు కలశస్థాపన, అంకురార్పణ కార్యక్రమాలతో ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి అమ్మవారిని ఈరోజు మహాలక్ష్మి రూపంలో అలంకరించారు. అక్టోబర్ 16న శుక్రవారం సాయంత్రం 6 గంటలకు బ్రహ్మోత్సవ ఆరంభ కార్యక్రమం నిర్వహించనున్నారు. అక్టోబర్ 17 శనివారం ఉదయం 10 గంటలకు ధ్వజారోహణం, సాయంత్రం ప్రత్యేక పూజలు, అక్టోబర్ 18 ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రీవారి కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. అక్టోబర్ 20 మంగళవారం సాయంత్రం 7 గంటలకు శమీ పూజ (దసరా) కార్యక్రమం, అక్టోబర్ 21 బుధవారం ఉదయం 8 గంటలకు మహాపూర్ణాహుతి, చక్రస్నానం కార్యక్రమాలతో ఉత్సవాలు ముగియనున్నాయి.

అదే విధంగా అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రతిరోజూ వివిధ అలంకారాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 16 నుంచి 19వ తేదీ వరకు బ్రహ్మోత్సవాల్లో భాగంగా వివిధ సేవలు, ప్రత్యేక పూజలు ఏర్పాటు చేశారు. ఈ పవిత్ర ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి, అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆలయ నిర్వాహకులు కోరారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ చైర్మన్ ఉప్పల యాదగిరి రెడ్డి, కార్యనిర్వహణాధికారి మఠం వీరేశం, ఆలయ అర్చకులు లక్ష్మణాచార్యులు, కేవీ రమణాచార్యులు, నారాయణచార్యులు, వేణుగోపాలాచార్యులు, ఆలయ సిబ్బంది నరసింహులు, మహేందర్ యాదవ్, శ్రీనివాస్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

ASHOK, KAPRA

ASHOK, KAPRA