Abdullapurmet: బండరావిరాల గ్రామ పంచాయతీకి లక్షల విలువైన ఫర్నిచర్ విరాళం!

Abdullapurmet: అబ్దుల్లాపూర్‌మెట్ బండరావిరాల గ్రామ పంచాయతీకి కొరివి నవీన్ కుమార్ గుప్తా తన తండ్రి జ్ఞాపకార్థం ఫర్నిచర్ విరాళంగా ఇచ్చారు.

AJAY, HAYATH NAGAR
Published on: 29 Nov 2026 1:41 PM IST
Abdullapurmet
X

Abdullapurmet: బండరావిరాల గ్రామ పంచాయతీకి లక్షల విలువైన ఫర్నిచర్ విరాళం!

Abdullapurmet: బండరావిరాల గ్రామ పంచాయతీ కార్యాలయ అవసరాలను గుర్తించి, తన తండ్రి జ్ఞాపకార్థం లక్షల రూపాయల విలువైన ఫర్నిచర్‌ను విరాళంగా అందించి శ్రీ మాత రియల్ ఎస్టేట్ అధినేత కొరివి నవీన్ కుమార్ గుప్తా తన దాతృత్వాన్ని చాటుకున్నారు.

బండరావిరాల గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఫర్నిచర్ కొరత కారణంగా సమావేశాల నిర్వహణతో పాటు ప్రజలకు సేవలు అందించడంలో సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించిన కొరివి నవీన్ కుమార్ గుప్తా తన తండ్రి కీ.శే. కొరివి పాండరయ్య జ్ఞాపకార్థం 5 ఆఫీస్ టేబుళ్లు, 15 ఎగ్జిక్యూటివ్ కుర్చీలు, 100 సాధారణ కుర్చీలు, 2 బీరువాలను గ్రామ పంచాయతీకి విరాళంగా అందించారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కందికంటి విజయ్ కుమార్ మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధిలో భాగస్వాములవుతూ పంచాయతీ కార్యాలయ అవసరాలకు సహకరించడం అభినందనీయమన్నారు. స్వర్గీయ కొరివి పాండరయ్య జ్ఞాపకార్థం ఆయన కుమారుడు అందించిన ఈ సహకారం గ్రామ ప్రజలకు ఆదర్శప్రాయమని కొనియాడారు. గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని, దాతల తోడ్పాటు గ్రామ ప్రగతికి ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు.

అనంతరం సర్పంచ్ కందికంటి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కొరివి నవీన్ కుమార్ గుప్తాను శాలువాతో ఘనంగా సత్కరించి, గ్రామ పంచాయతీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి ఈర్లపల్లి శ్రీనివాస్, వార్డు సభ్యులు కందికంటి అనూష ప్రవీణ్, గుండ్ల భవాని శివ ముదిరాజ్, కారోబార్ ఏర్పుల శ్రీశైలం, గ్రామ పెద్దలు కందికంటి దానేష్, వల్లపు ఐలేష్ తదితరులు పాల్గొన్నారు.

AJAY, HAYATH NAGAR

AJAY, HAYATH NAGAR