Vikarabad: సర్దార్ పటేల్‌కు ఎస్పీ స్నేహ మెహ్రా ఘన నివాళి
Vikarabad: జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఐపీఎస్ సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Vikarabad: సర్దార్ పటేల్‌కు ఎస్పీ స్నేహ మెహ్రా ఘన నివాళి
Vikarabad: జాతీయ ఐక్యతా దినోత్సవం (రాష్ట్రీయ ఏక్తా దివస్) మరియు భారతదేశ ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని శనివారం వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపీఎస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ ఐక్యత, సమగ్రత, సమైక్యత కోసం ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
అనంతరం పోలీస్ అధికారులు, సిబ్బందిని ఉద్దేశించి జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, భారతదేశ ఐక్యతను కాపాడటంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పోషించిన పాత్ర చరిత్రలో చిరస్మరణీయమని పేర్కొన్నారు.
స్వాతంత్ర్యం అనంతరం దేశంలోని అనేక సంస్థానాలను భారత యూనియన్‌లో విలీనం చేసి, అఖండ భారత నిర్మాణానికి ఆయన చేసిన కృషి ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు.
దేశ సమగ్రతను పరిరక్షించడంలో ఆయన చూపిన దృఢ సంకల్పం, నాయకత్వ లక్షణాలు ఆదర్శప్రాయమని అన్నారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత అని, పోలీస్ శాఖ ప్రజల భద్రతతో పాటు శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తుందని ఎస్పీ గారు పేర్కొన్నారు.
ప్రజలందరితో సమన్వయంతో పనిచేస్తూ, సమాజంలో శాంతి, సోదరభావం, ఐకమత్యాన్ని పెంపొందించేందుకు ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలని సూచించారు.
అనంతరం జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ఎస్పీ గారు పోలీస్ అధికారులు, సిబ్బందితో జాతీయ ఐక్యతా ప్రతిజ్ఞ చేయించారు. దేశ ఐక్యత, సమగ్రత, భద్రతను పరిరక్షించేందుకు కట్టుబడి ఉంటామని, దేశ ప్రజల మధ్య ఐకమత్యం, సోదరభావాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీ రాజేశ్ మీనా, డీసీఆర్‌బీ డీఎస్పీ జనయ్య, డీటీసీ డీఎస్పీ శ్రీనివాస్, ఏఆర్ డీఎస్పీ వీరేశ్, AO ఖాజా మోహినోద్దీన్ , DSB ఇన్స్పెక్టర్ నాగార్జున, ఆర్‌ఐ ల తో పాటు ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




