Malkajgiri: అక్టోబర్ 6న ఉస్మానియా యూనివర్సిటీలో మాదిగ విద్యార్థుల జాతీయ సదస్సు!

Malkajgiri: అక్టోబర్ 6న ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించనున్న మాదిగ విద్యార్థి ప్రతినిధుల జాతీయ సదస్సును విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ నేతలు పిలుపునిచ్చారు.

Bodike Manohar, Malkajgiri
Published on: 4 Oct 2026 5:52 PM IST
Malkajgiri
X

Malkajgiri: అక్టోబర్ 6న ఉస్మానియా యూనివర్సిటీలో మాదిగ విద్యార్థుల జాతీయ సదస్సు!

Malkajgiri: అక్టోబరు 6న హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించనున్న మాదిగ విద్యార్థి ప్రతినిధుల జాతీయ సదస్సును విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఇన్‌చార్జి తిప్పారపు లక్ష్మణ్, జాతీయ నాయకులు కేశపాగ రామచందర్ మాదిగ పిలుపునిచ్చారు.

జాతీయ సదస్సు విజయవంతానికి సంబంధించి మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ మండల అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులతో సన్నాహక సమావేశాన్ని ఈస్ట్ ఆనంద్‌బాగ్ డివిజన్ తాళ్లబస్తి కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్యార్థులు, యువత సామాజిక అంశాలపై అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సదస్సుకు ప్రతి విద్యార్థి నిర్దేశించిన డ్రెస్ కోడ్‌తో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

వ్యక్తిగత ప్రయోజనాలకు పరిమితం కాకుండా సమాజం కోసం యువత పనిచేయాలని వారు సూచించారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆలోచనా విధానానికి అనుగుణంగా సమాజ శ్రేయస్సు కోసం ఉద్యమాలను నిర్మించే క్రమంలో విద్యార్థులు, యువత పాత్ర కీలకమని పేర్కొన్నారు. సామాజిక సమస్యలు, హక్కులు, ఉద్యమాలపై అవగాహన పెంపొందించుకోవడానికి జాతీయ సదస్సు ఉపయోగపడుతుందని తెలిపారు. విద్యార్థులు భవిష్యత్‌లో సామాజిక అంశాలపై బాధ్యతాయుతంగా వ్యవహరించేలా తమను తాము తీర్చిదిద్దుకోవాలని సూచించారు.

ఈ సమావేశంలో ఎంజెఎఫ్ రాష్ట్ర నాయకులు మనోహర్, ఎమ్మార్పీఎస్ నాయకులు బచ్చలకూర స్వామి, మల్కాజిగిరి మండల అధ్యక్షుడు యు. రామచందర్, బోగారం పవన్, చిన్నబాబు,నిఖిల్, పోశాలు,రాజేష్,బాలు, చరణ్, కిషోర్,హరీష్, కాశి, గోపి కృష్ణ, గణేష్,తదితరులు పాల్గొన్నారు.

Bodike Manohar, Malkajgiri

Bodike Manohar, Malkajgiri