LB Nagar: నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు వీధి శునకం బలి ఏడు పిల్లలు అనాథలు!
LB Nagar: ఎల్బీనగర్ మన్సూరాబాద్‌లో కారు ఢీకొని వీధి శునకం మృతి చెందింది. దాని 7 పిల్లలు అనాథలవ్వగా బాధ్యుడిపై చర్యలు తీసుకోవాలని నాగోలు పిఎస్‌లో ఫిర్యాదు చేశారు
LB Nagar: నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు వీధి శునకం బలి ఏడు పిల్లలు అనాథలు!
LB Nagar: నిర్లక్ష్యంగా కారు నడిపి ఓ వీధి శునకం మృతికి కారణమయ్యారంటూ ఓ వ్యక్తిపై జంతు ప్రేమికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మన్సూరాబాద్‌లోని బండ్లగూడ రాజీవ్ స్వగృహ సముదాయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన శునకానికి చికిత్స అందించినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. ఇటీవలే ఏడు పిల్లలకు జన్మనిచ్చిన శునకం మృతి చెందడంతో జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాజీవ్ స్వగృహ సముదాయంలోని ‘ఏ’ బ్లాక్‌లో నివసించే మీనాక్షి వీధి శునకాలకు ఆహారం అందిస్తూ వాటిని సంరక్షిస్తున్నారు. ఈ నెల 22న రాత్రి అదే బ్లాక్‌లో నివసించే అనుదీప్ వేగంగా, నిర్లక్ష్యంగా కారు నడుపుతూ శునకాన్ని ఢీకొట్టినట్లు మీనాక్షి ఆరోపించారు. ప్రమాదాన్ని గమనించి అక్కడికి వెళ్లేలోపే కారు వెళ్లిపోయిందని తెలిపారు. నడుము, రెండు కాళ్లకు తీవ్ర గాయాలైన శునకానికి వెంటనే చికిత్స చేయించినా, ఆరోగ్యం విషమించి శనివారం మృతి చెందినట్లు వెల్లడించారు.
శునకం మృతికి కారణమైన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని, దాని ఏడు పిల్లల సంరక్షణ బాధ్యతను కూడా అతడే తీసుకోవాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేశారు. మృతి చెందిన శునకంతో నాగోలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశానాని, బేబీ డాగ్స్ ను న్యాయం జరిగేవరకు వదిలి పెట్టే ప్రసక్తి లేదని, అవసరం అయితే పోలీస్ స్టేషన్ ముందు నిరహార దీక్ష చేస్తానని తెలిపారు మీనాక్షి..
ఘటనకు సంబంధించిన సీసీ కెమెరాల ఫుటేజీని సేకరించి పోలీసులకు అందించారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు వివరాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.




