Veldanda: ధనలక్ష్మిగా దర్శనమిచ్చిన దుర్గామాత: వెల్దండలో పూజలు!

Veldanda: నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ బుధవార్‌పేట ఆంజనేయస్వామి ఆలయంలో దుర్గామాత ఆరో రోజు ధనలక్ష్మిగా దర్శనమిచ్చారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పూజలు జరిగాయి.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 16 Oct 2026 9:57 PM IST
Veldanda
X

Veldanda: ధనలక్ష్మిగా దర్శనమిచ్చిన దుర్గామాత: వెల్దండలో పూజలు!

వెల్దండ: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని బుధవార్ పేట ఆంజనేయస్వామి దేవాలయంలో మండల పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మండల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అధ్యక్షులు బొల్లంపల్లి అల్లంపల్లి కృష్ణ కార్యదర్శి పాలాది సంతోష్ కార్యవర్గం ఆధ్వర్యంలో పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు.

అమ్మవారు ఆరవ రోజు ధనలక్ష్మి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు పూజలను జూలూరీ బాలస్వామి పాలాది సంతోష్ బికమండ్ల రాఘవేందర్ దంపతులు పూజలను నిర్వహించినారు. వారిని ఆర్యవైశ్య మహాసభ జిల్లా మాజీ అధ్యక్షులు బచ్చు రామకృష్ణ ఆర్యవైశ్య మహాసభ ఉత్సవ కమిటీ అధ్యక్షులు అల్లంపల్లి కృష్ణ తో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు శాలువాలతో సన్మానించి అమ్మవారి జ్ఞాపకాలను అందజేశారు అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు మాజీ అందజేశారు. కార్యక్రమంలో మిరియాల రాజయ్య. జూలూరి ఈశ్వరయ వజ్ర లింగo బాదం పాండు చంద్రo జగదీశ్వర్ తదితరులు ఉన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY