Nacharam: నాచారంలో విద్యుత్ వృథా పట్టపగలే వెలుగుతున్న వీధి దీపాలు
Nacharam: నాచారంలో పట్టపగలే వెలుగుతున్న విద్యుత్ దీపాలు. విద్యుత్ వృథా అవుతున్నా పట్టించుకోని అధికారులపై స్థానికుల ఆగ్రహం.
Nacharam: నాచారంలో విద్యుత్ వృథా పట్టపగలే వెలుగుతున్న వీధి దీపాలు
నాచారం: రాఘవేంద్ర నగర్‌లోని శ్రీ పోచమ్మ తల్లి దేవాలయం లైన్‌లో విద్యుత్ దీపాలు ఉదయం నుంచి పట్టపగలే వెలుగుతున్నాయి.
దీంతో విద్యుత్ వృథా అవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పగటి సమయంలో దీపాలు వెలుగుతున్నా సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి పగటి వేళల్లో విద్యుత్ దీపాలు వెలగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.




