Nacharam: ఈ నెల 31న వైభవంగా శ్రీనివాస కల్యాణ మహోత్సవం

Nacharam: హైదరాబాద్ నాచారంలో ఈ నెల 31న శ్రీనివాస కల్యాణం. 15 వేల మందికి పైగా భక్తులు హాజరవుతారని, విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు నందికొండ శ్రీనివాస్ రెడ్డి వెల్లడి.

HARISH, TARNAKA
Published on: 29 Oct 2026 7:12 PM IST
Nacharam
X

Nacharam: ఈ నెల 31న వైభవంగా శ్రీనివాస కల్యాణ మహోత్సవం

నాచారం: హైదరాబాద్‌ నాచారంలో శ్రీనివాస ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఈ నెల 31న శ్రీనివాస కల్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ట్రస్ట్‌ చైర్మన్‌ నందికొండ శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. ఈ ఆధ్యాత్మిక వేడుకకు సుమారు 15 వేల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నట్లు వెల్లడించారు.

భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని నందికొండ శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. కల్యాణ మహోత్సవం అనంతరం భక్తులందరికీ మహా అన్నప్రసాద వితరణ చేపట్టనున్నట్లు వెల్లడించారు.

శ్రీనివాస కల్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని మూడు రోజులపాటు సాయంత్రం వేళల్లో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించాలని కోరారు. భక్తులందరూ సంప్రదాయ దుస్తులు ధరించి వేడుకలకు హాజరై ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.

భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కార్యక్రమ ప్రాంగణంలో అవసరమైన ఏర్పాట్లపై ట్రస్ట్‌ ప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఈ మహోత్సవంతో నాచారం ప్రాంతంలో ఆధ్యాత్మిక సందడి నెలకొననుంది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్‌ చైర్మన్‌ నందికొండ శ్రీనివాస్‌ రెడ్డితో పాటు వెంకటరమణారెడ్డి, బోగ్గారపు రమేష్‌, ఏగిన భాస్కర్‌, రాజ్‌కుమార్‌ గౌడ్‌, జొన్నలగడ్డ శేషగిరిరావు, నందికొండ మధుసూదన్‌ రెడ్డి, ఉదయ్‌కుమార్‌, కంటేటి వరప్రసాదరావు, జూపల్లి నరేష్‌, రాజోలు రామ దీక్షితులు, దుర్గా ప్రసాద్‌, గుంటక శేఖర్‌ రెడ్డి తదితర ట్రస్ట్‌ సభ్యులు పాల్గొన్నారు.

HARISH, TARNAKA

HARISH, TARNAKA