Nacharam: ఉస్మానియాలో ఎంఎస్‌ఎఫ్ యుద్ధభేరి - భారీగా తరలిరావాలని పిలుపు
Nacharam: ఉస్మానియాలో అక్టోబర్ 6న జరిగే ఎమ్మెస్‌ఎఫ్ యుద్ధభేరికి విద్యార్థులు భారీగా తరలిరావాలని ఎమ్మార్పీఎస్ నాయకులు కోరారు. ముఖ్య అతిథిగా మందకృష్ణ మాదిగ.
Nacharam: ఉస్మానియాలో ఎంఎస్‌ఎఫ్ యుద్ధభేరి - భారీగా తరలిరావాలని పిలుపు
నాచారం:
ఉస్మానియా యూనివర్సిటీలో అక్టోబర్ 6న నిర్వహించనున్న ఎమ్మెస్‌ఎఫ్ యుద్ధభేరి కార్యక్రమానికి ఉప్పల్ నియోజకవర్గంలోని విద్యార్థులు అధిక సంఖ్యలో తరలిరావాలని ఎమ్మార్పీఎస్ నాయకులు పిలుపునిచ్చారు. ఉప్పల్ ఇన్‌చార్జి కొరపాక అంజి మాదిగ ఆధ్వర్యంలో నాచారంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ హాజరవుతారని తెలిపారు. విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా మాజీ అధ్యక్షుడు గంగా ప్రణయ్, ఉప్పల్ అధ్యక్షుడు క్రాంతికిరణ్, చిల్కానగర్ అధ్యక్షుడు బాలరాజ్, మల్లాపూర్ అధ్యక్షుడు కొల్లూరి రవి, సంతోష్‌కుమార్, ఉప్పల్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు యోగేష్, కొరపాక రమేష్ తదితర ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.




