Hyderabad: మున్నూరు కాపు సంఘం అభివృద్ధికి అందరూ ఐక్యంగా రావాలి!

Hyderabad: బషీర్‌బాగ్‌ ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ మున్నూరు కాపు సంఘం ఎన్నికల సన్నాహక సమావేశం.

GIRI, CENTRAL ZONE
Published on: 14 Nov 2026 4:36 PM IST
Hyderabad
X

Hyderabad: మున్నూరు కాపు సంఘం అభివృద్ధికి అందరూ ఐక్యంగా రావాలి!

Hyderabad: మున్నూరు కాపు సంఘం అభివృద్ధి, సమాజ అభ్యున్నతి లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు సాగాలని తెలంగాణ మున్నూరు కాపు సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కొండ దేవయ్య పటేల్ పిలుపునిచ్చారు.

పదవులు ముఖ్యం కాదని, తన ప్రాణం ఉన్నంతవరకు కుల సేవకుడిగా పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లొ సంఘం రాష్ట్రనూతనకార్యవర్గాన్ని ఎన్నుకునేందుకు రెండు రోజుల పాటు నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల సన్నాహక సమావేశానికి టి. రాజ్‌కుమార్, ఆర్.వి. మహేందర్ అధ్యక్షత వహించారు .

ఈ సందర్భంగ్ ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది మంది సభ్యులతో ఎన్నికల కమిటీ ఏర్పాటు చేయడంతో పాటు, 33 జిల్లాల్లో సభ్యత్వ నమోదు చేపట్టి అర్హులైన సభ్యులతో ఓటర్ల జాబితానురూపొందించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యవర్గానికి ప్రత్యక్ష ఎన్నికలునిర్వహించేందుకు అవసరమైన విధివిధానాలు, ఎన్నికల నియమావళి, షెడ్యూల్‌పై చర్చించినట్లుపేర్కొన్నారు. సంఘం బలోపేతానికి వ్యక్తిగత ప్రయోజనాలకు అతీతంగా అందరూ సమష్టిగా కృషి చేయాలని, ఐక్యతతోనే సమాజానికి మరింత సేవ చేయగలమని అన్నారు.

GIRI, CENTRAL ZONE

GIRI, CENTRAL ZONE