Dilsukhnagar: సంతోషి మాత ఆలయంలో పూజలు చేసిన ఎంపీ ఈటల రాజేందర్!
Dilsukhnagar: హైదరాబాద్‌లోని దిల్సుఖ్‌నగర్ సంతోషి మాత ఆలయంలో ఎంపీ ఈటల రాజేందర్ ప్రత్యేక పూజలు. విగ్రహంపై జరిగిన దాడి ఘటనను తీవ్రంగా ఖండించిన ఈటల.
Dilsukhnagar: సంతోషి మాత ఆలయంలో పూజలు చేసిన ఎంపీ ఈటల రాజేందర్!
Dilsukhnagar: దిల్సుఖ్‌నగర్‌లోని సంతోషి మాత ఆలయాన్ని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ సందర్శించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవల ఆలయంలో చోటుచేసుకున్న విగ్రహంపై దాడి ఘటనను ఆలయ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. సంతోషి మాత ఆలయంలోకి కర్రలు తీసుకువచ్చి అమ్మవారి కిరీటంపై కొట్టి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఆ పద్ధతిని వ్యతిరేకిస్తున్నానని, అందుకే దాడి చేశానని నిందితుడు చెప్పినట్లు ఈటల పేర్కొన్నారు.
“సంతోషి మాత ఆలయంపై జరిగిన దాడి ఇదే మొదటిది కాదు” అని ఈటల అన్నారు. తెలంగాణలో గతంలోనూ పలు ఆలయాలపై దాడులు, చోరీలు జరిగిన ఘటనలు ఉన్నాయని తెలిపారు. ఇలాంటి ఘటనలు హిందువుల మనోభావాలు, విశ్వాసాలను దెబ్బతీస్తాయని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ అంశంపై స్పందించాలని ఈటల కోరారు. మతం మార్చుకోవడం వ్యక్తిగత విషయమేనని.. అయితే మతపరమైన విశ్వాసాలను కించపరిచేలా లేదా ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా ఎవరూ వ్యవహరించకూడదని అన్నారు.
ధార్మిక వేదికల్లో జరిగే ప్రసంగాలు, వాటి ప్రభావంపై కూడా సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉందని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. ఆలయాల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.b




