Nagole: నాగోల్‌లో రూ.26 లక్షలతో నూతన సీసీ రోడ్డు ప్రారంభం!
Nagole: నాగోల్ డివిజన్‌లో రూ.26 లక్షలతో నిర్మించిన నూతన సీసీ రోడ్డును ఎంపీ ఈటెల రాజేందర్, కార్పొరేటర్ అరుణ సురేందర్ యాదవ్ ప్రారంభించారు.
Nagole: నాగోల్‌లో రూ.26 లక్షలతో నూతన సీసీ రోడ్డు ప్రారంభం!
Nagole: నాగోల్ డివిజన్ అభివృద్ధిలో మరో ముందడుగు పడింది. స్థానిక ప్రజల ఎన్నో రోజుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని రూ.26 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటెల రాజేందర్ గారు, నాగోల్ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్, చింతల అరుణ సురేందర్ యాదవ్ గారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు మౌలిక వసతులు కల్పించడం, నాగోల్ డివిజన్‌ను మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. రహదారుల అభివృద్ధితో ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన రాకపోకలు అందడంతో పాటు వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులు తగ్గుతాయని పేర్కొన్నారు.
ప్రజల అవసరాలను గుర్తించి నిధులు సమకూర్చి అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్న ఈటెల రాజేందర్ గారికి, అలాగే స్థానిక ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్న చింతల అరుణ సురేందర్ యాదవ్ గారికి స్థానిక ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజల సమస్యే తమ సమస్యగా భావించి, అభివృద్ధి పనులను రాజకీయాలకు అతీతంగా ముందుకు తీసుకెళ్తామని నాయకులు స్పష్టం చేశారు. నాగోల్ డివిజన్‌లో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు తదితర మౌలిక వసతుల అభివృద్ధికి భవిష్యత్తులోనూ నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంక్రీట్ ఆవాస రెసిడెన్స్ సభ్యులు అనిల్, కిషోర్, రాధాకృష్ణ, మధు, రాకేష్, లక్ష్మి సుజాత, బీజేపీ ఎల్బీనగర్ అసెంబ్లీ ఇంచార్జ్ సామ రంగారెడ్డి గారు, కేశిరెడ్డి పద్మారెడ్డి, సిద్ధల ఐలయ్య, పంగా శ్యామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.




